రంజాన్ ఇస్లాం యొక్క ఐదు అనివార్యతలలో (లేక స్తంభాలలో) ఒకటి. దానిలోని 30 దినాలలో ప్రతిరోజు, ముస్లింలు సూర్యోదయం నుండి సుర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. ఆ సమయములో వారు ఆహారము, పానీయములు, పొగత్రాగుట, లైంగిక సంబంధాలు నిషేధించాలి.
మధ్యాహ్న సమయాలలో స్త్రీలు మంచి విందు భోజనం సిద్ధపరుస్తూ సమయం గడుపుతారు. సూర్యాస్తమయాన, ఉపవాసం ముగించుటకు కుటుంబాలు కూడుకుంటారు. సాంప్రదాయికంగా కుటుంబాలు నీరు త్రాగి ఉపవాసం విరమించుకొని, తరువాత మూడు ఎండు ఖర్జూరాలు తిని, విందు భోజనం చేస్తారు. క్రొత్త రంజాన్ టీవీ సిరీస్ చూసిన తరువాత, కొందరు పురుషులు (మరియు స్త్రీలు) కాఫీ షాపులకు వెళ్లి కాఫీ త్రాగి, స్నేహితులతో కలిసి అర్థ రాత్రి వరకు పొగత్రాగుతారు.
ఈ మధ్య సంవత్సరాలలో చాలామంది ఉపవాసం చేయుట మానివేసి, నెలంతా ఎక్కువగా కనిపించు వేషధారణ, పెరుగుతున్న నేరములు, దురుసుతనం వలన విసిగిపోయినప్పటికీ, ఇతరులు ఈ సమయములో తమ మతమును గూర్చి మరింత తీవ్రంగా ఆలోచిస్తారు. చాలామంది సాయంకాల ప్రార్థనా కూడికలలో పాలుపంచుకుంటారు, ఇతర ఆచార ప్రార్థనలు చేస్తారు. కొందరు కురాన్ అంతా కూడా చదువుతరు (బైబిలులో పదియవవంతు). ఈ నిజాయితీగల అన్వేషణ మనం వారి కొరకు వ్యూహాత్మకముగా ప్రార్థించుటకు అవకాశం ఇస్తుంది.